ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై.. ఆయన అనుచరులపై కేసు నమోదైంది. విధులను అడ్డగించడంతో పాటు బెదిరింపులకు దిగారని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఫిర్యాదు చేసేందుకు పాడి కౌశిక్‌రెడ్డి పీఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి కలిసి తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్నారని.. వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు చేసేందుకు ఆయన పీఎస్‌కి వెళ్లారు. సీఎం రేవంత్, శివధర్రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
…………………………..