
* మోదీ మెడపై కత్తిలా బీసీ రిజర్వేషన్లు
* బీజేపీ, బీఆర్ ఎస్ అసెంబ్లీలో తోకముడిచాయి
* తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశంలో, రాష్ట్రంలో బలహీనవర్గాల గొంతు నులిపే కుట్ర జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanthreddy) వెల్లడించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన 8వ అఖిల భారత పద్మశాలి మహాసభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji)ది కీలక పాత్ర అని రేవంత్ అన్నారు. ఉద్యమం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసినట్లు గుర్తు చేశారు. 2011లో కాంగ్రెస్ చేసిన కులగణన సర్వేను మోదీ ప్రభుత్వం తొక్కి పెట్టిందన్నారు. కులగణన చేసి బీసీల సంఖ్య 56.33 శాతంగా తేల్చామన్నారు. తమ సర్వే తప్పుల తడక అని కొందరు విమర్శిస్తున్నారని, తప్పు చూపమంటే బీఆర్ ఎస్, బీజేపీ అసెంబ్లీలో తోక ముడిచాయని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మాణం చేస్తే, మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేక, కులగణన సర్వేని తప్పుబడుతున్నారని వెల్లడించారు. బలహీనవర్గాల గొంతు నులిపే కుట్ర జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswarrao), సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ (Warangal Mayor)గుండు సుధారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం నేతలు పాల్గొన్నారు.
…………………………………………….