Tatikonda Auto Union Elections
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ సర్దార్ సర్వాయి పాపన్న ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నిక శుక్రవారం జరిగింది. గౌరవ అధ్యక్షులు ఎండి.సాజిద్ అధ్యక్షులు మారపాక ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షుడు చిక్కుడు యాకరాజు, కార్యదర్శిగా గిట్ల నరేష్, సహాయ కార్యదర్శిగా ఇస్రం సారయ్య, కోశాధికారిగా ఆకారపు కుమార్ ఎన్నిక అయ్యారు. నూతన కార్యవర్గ ఎన్నిక అనంతరం ఆటో డ్రైవర్లు మేడే వేడుకలను నిర్వహించుకున్నారు.
* హమాలీలు, తాపీ మేస్తిర్ల ఆధ్వర్యంలో…
ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే దినోత్సవం తాటికొండలోని హమాలీ కార్మికులు, తాపీ మేస్త్రిలు ఎర్రజెండా ఎగరవేసి మేడే దినోత్సవం జరుపుకున్నారు. సిపిఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ అనుబంధ సంఘాలు ఎర్రజెండాను ఎగరవేసి మేడే వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో సిద్దుల సుదర్శన్, మారుపాక మధు, తూర్పాటి కనకయ్య, అనంతపురం బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
