* సియోల్ నది సందర్శన
ఆకేరు న్యూస్ డెస్క్ : తెలంగాణ(Telangana)కు చెందిన మంత్రుల బృందం దక్షిణ కొరియా(South Korea) పర్యటనలో ఉంది. సియోల్ రివర్ ఫ్రంట్ (Siyol River Front) అభివృద్ధిని అధ్యయనం చేస్తోంది. హైదరాబాద్(Hyderabad)లో మూసీ(musi) పునరుజ్జీవం నేపథ్యంలో సియోల్ నది అధ్యయనానికి మంత్రులు పొంగులేటి(Ponguleti), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), ఎంపీ చామల కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, పురపాలక శాఖ కమిషనర్ దానకిశోర్(Danakishore), మూసి రివర్ ప్రంట్ అధికారుల బృందం వెళ్లింది.
24 వరకు వీరి పర్యటన కొనసాగుతుంది. నగరంలో మాపోలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగం కేంద్రాన్ని ఈరోజు సందర్శించారు. సియోల్ నగరపాలక సంస్థ రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, దీనికోసం WTE ( వెస్ట్ టూ ఎనర్జీ ) టెక్నాలజీ వినియోగం, పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా నగర వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్టు అక్కడి అధికారులు తెలంగాణ మంత్రుల బృందానికి వివరించారు.
…………………………………………….