* సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, అధికారుల బృందం.. అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆకర్షించే పనిలో పడిరది. ఈ క్రమంలోనే దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సీఐఐ, హీరో మోటార్ కార్ప్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు బిజినెస్మెన్లు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా మార్చేందుకు అందరు కలిసి కృషి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో డ్రైపోర్టును నిర్మిస్తామని దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు తీరప్రాంతం లేని లోటును పూడ్చేందుకు.. కొత్తగా డ్రై పోర్టును నిర్మించి.. సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం పోర్టుకు ప్రత్యేకంగా రోడ్డు, రైలు మార్గాలతో దాన్ని అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.
……………………………………….