
* సోషల్మీడియాలో వీడియో వైరల్
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆమె సమాజంలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై పోరాడిన నటి. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎందరో బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై గళం ఎత్తారు. అలాంటి నటి ఇప్పుడు సమాజంలో కాదు.. ఏకంగా సొంత ఇంట్లోనే వేధింపులు ఎక్కువయ్యాయని ఎక్కిఎక్కి ఏడ్చారు. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటి తను శ్రీదత్తా (Tanushree dutta) మీటూ ఉద్యమంతో దేశ వ్యాప్తంగా సంచలనమయ్యారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పై తను శ్రీ చేసిన ఆరోపణలపై పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కారు. ఆరు సంవత్సరాలుగా ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానని ఆవేదన చెందింది. దీనికి సంబంధించి ఇన్ స్టాలో ఓ వీడియో (Insta Vedio) షేర్ చేసింది. ఇందులో తను శ్రీ కన్నీటి పర్యంతం అవుతూ మాట్లాడింది. ‘నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. ఏం మాట్లాడలేను. ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. పోలీసులకు ఫోన్ చేసాను. వారు స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయమంటున్నారు. వీలు చూసుకుని వెళ్తాను. భద్రత లేకుండా పోయింది. ఇంటికొచ్చి మరీ వేదిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. నా ఆరోగ్యం కూడా క్షీణించింది. పని మనిషిని కూడా పెట్టుకోలేకపోయాను. గతంలో వచ్చిన పని మను షులు వస్తువులు దొంగిలించారు. దీంతో ఇప్పుడన్నీ పనులు నేనే చేసుకుంటున్నానన్నారు. అలాగే మరో వీడియోలో రాత్రివేళలో తన ఇంటి బయట వినిపించే శబ్ధాలను రికార్డు చేసి పోస్ట్ చేసి మరింత ఆందోళ నకు గురి చేస్తున్నారంది. `నిద్రలేక, ప్రశాంతత లేక ఉక్కిరిబిక్కిరవుతున్నాను. ఇది కూడా వేధింపుల భాగమేనని అభిప్రాయపడింది.
……………………………….