* ఏటూరు నాగారానికి ఆర్టీసీ డిపో మంజూరు
* ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
* హర్షం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
ఆకేరున్యూస్, ములుగు: ఏజెన్సీ ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారానికి ఆర్టీసీ బస్ డిపో మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం సచివాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్‌లను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు జిల్లా ఏర్పాటైన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో ఆర్టీసీ డిపో ఏర్పాటుపై ప్రభుత్వానికి విన్నవించిన వెంటనే మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు బస్ డిపో మంజూరీ చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అతి తర్వలోనే ఆర్టీసీ బస్ డిపో నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏజెన్సీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్ డిపో మంజూరు చేయడం సంతోషంగా ఉందని, మారుమూల ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపడి ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట ములుగు డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ తదితరులు ఉన్నారు.
……………………………………………….