* దీనికి బదులుగా నవంబర్ 9ని వర్కింగ్ డే(రెండో శనివారం)గా ప్రకటన
ఆకేరున్యూస్, హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో 17న సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా నవంబర్ 9న వర్కింగ్ డే(రెండో శనివారం)గా ప్రకటించింది. దీంతో నవంబర్ 9న స్కూళ్లు, ప్రభుత్వ విద్యా సంస్థలు పని చేయనున్నాయి. వినాయక నిమజ్జనం రోజే మిలాద్ ఉన్ నబీ కూడా ఉంది. రెండింటికి కలిపి సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇక ఇవాళ రెండో శనివారం కావటంతో కొన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. 15వ తేదీ ఆదివారం కావడం వల్ల వరుసగా 2 రోజులు సెలవులు రానున్నాయి. నిజానికి మిలాద్ ఉన్ నబీ హాలీ డే విషయంలో నెలవంక దర్శనం కీలకంగా ఉంటుంది. గతేడాది కూడా ఓ తేదీని నిర్ణయించినప్పటికీ… మరో తేదీలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. అయితే 17వ తేదీనే నిమజ్జనం జరగనుంది. ఇదే రోజు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు కూడా జరగాల్సి ఉంటుంది. కానీ ఇటీవలే ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… మిలాద్ కమిటీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
————————–