* జగిత్యాలకు అశోక్.. సూర్యాపేటకు సన్‌ప్రీత్
* మహబూబ్‌నగర్‌కు జానకీ..
* తెలంగాణలో 28 మంది ఐపీఎస్‌ల బదిలీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణ(Telangana) లో భారీ సంఖ్యలో ఐపీఎస్ (IPS)ల బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 28 మందిని బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి(CS Shanti Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ ఎస్పీ(SP) గా శరత్చంద్ర(Saratchandra) ను నియమించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ (SP) గా ఉన్న రితిరాజ్ (Ritiraj) అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. మంచిర్యాల డీసీపీ (DCP) గా ఉన్న అశోక్ కుమార్(Ashok Kumar)ను జగిత్యాల ఎస్పీ(SP) గా.. అక్కడున్న సన్‌ప్రీత్ సింగ్(Sanpreet Singh) ను ప్రభుత్వం సూర్యాపేట ఎస్పీ (SP)గా నియమించారు. హైదరాబాద్(Hyderabad) ట్రాఫిక్ డీసీపీ (DCP) గా ఉన్న సుబ్బారాయుడి (Subbarayudu) తో పాటు మరో నలుగురికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
బదిలీ అయిన అధికారి (బ్రాకెట్లో పోస్టు )
– విశ్వజిత్ కంపాటి ( సీఐడీ ఎస్పీ)
– సన్‌ప్రీత్ సింగ్.. (సూర్యాపేట ఎస్పీ)
– అశోక్ కుమార్ (జగిత్యాల ఎస్పీ)
– రాహుల్ హెగ్డే (హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ)
– ఎల్.సుబ్బారాయుడు (డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి)
– టి.శ్రీనివాస రావు (జోగులాంబ గద్వాల ఎస్పీ)
– రితిరాజ్ (ఏసీబీ జాయింట్ డైరెక్టర్)
– డీవీ శ్రీనివాస రావు (కొమురంభీం ఆసిఫాబాద్ ఎస్పీ)
– కె.సురేశ్‌కుమార్ (బాలానగర్ డీసీపీ)
– జానకీ.డి ( మహబూబ్‌నగర్ ఎస్పీ)
– హర్షవర్ధన్ (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ)
– బి.రాజేశ్ (శంషాబాద్ డీసీపీ)
– కె.నారాయణ రెడ్డి (వికారాబాద్ ఎస్పీ)
– ఎన్.కోటిరెడ్డి (మేడ్చల్ డీసీపీ)
– నితికపంత్ (2వ బెటాలియన్ కమాండెంట్)
– పీజేపీసీ ఛటర్జీ (డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి)
– శరత్చంద్ర పవార్ (నల్లగొండ ఎస్పీ)
– జి.చందన దీప్తీ (సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ)
– షేక్ సలీమా (వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ)
– ఎంఏ బారీ (డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి)
– పాటిల్ సంగ్రామ్‌సింగ్ (గణపాత్రో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)
– పి.సాయిచైతన్య (యాంటీ నార్కొటిక్ బ్యూరో ఎస్పీ)
– సాధన రష్మీ పెరుమాల్ (నార్త్‌జోన్ డీసీపీ)
– రోహిణి ప్రియదర్శిని (7వ బెటాలియన్ కమాండెంట్)
– బి.రాంప్రకాశ్ (డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి)
– బి.రాజమహేంద్ర నాయక్ (వరంగల్ వెస్ట్‌జోన్ డీసీపీ)
– పి.సీతారాం (డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి)
—————————