ఆకేరు న్యూస్, డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్(Facebook) మాతృ సంస్థ అయిన మెటా(Meta)కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Competition Commission of India) భారీ జరిమానా విధించింది. మెటా అనుబంధ సంస్థ అయిన వాట్సాప్(watsup) ప్రైవసీ విధానం ద్వారా మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న పేరుతో సీసీఐ మెటా ఫ్లాట్ ఫామ్(Meta Flatform) కు రూ.213.14కోట్ల జరిమానా వేసింది. దీనిపై మెటా స్పందిస్తూ అప్పీల్ కు వెళ్లనున్నట్లు పేర్కొంది. 2021లో తీసుకొచ్చిన అప్డేట్ కారణంగా యూజర్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలిపింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. అయితే.., 2021లో మెటా తీసుకొచ్చిన అప్డేట్ ప్రకారం.. వాట్సప్ సేవలను పొందడం కొనసాగించాలంటే, ఇందులో లభించే డేటాను మెటా కంపెనీలతో పంచుకునేందుకు వినియోగదారులు తప్పనిసరిగా అంగీకరించాలి. 2016లో దాన్ని మార్చింది. ఆ విషయంలో వినియోగదారులదే తుది నిర్ణయం. అయితే, అందుకు భిన్నంగా కొత్త విధానాన్ని అమలు చేసినందుకు ఈ మెటాకు సీసీఐ ఫైన్ వేసింది. మెటా అప్పీల్ (Meta Appeal)కు వెళ్లడంతో ఏం జరగనుందో వేచి చూడాలి.
……………………………………………………..