
* మంత్రులే పైసలు అడిగారన్న ఆరోపణలను తేల్చాలి
* గ్రూప్-1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలి
* మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రూప్-1 పరీక్షలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, మంత్రులే పైసలు అడిగారన్న ఆరోపణలపై నిగ్గు తేల్చాలని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ముజేసిందని విమర్శించారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ఫెయిల్ అయిన ఈ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని ట్వీట్ చేశారు. హైకోర్టు (High court) ఆదేశించినట్టు గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్ధానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడి తమ విలువైన సమయాన్నీ, అమ్మా, నాన్నల కష్టార్జితాన్నీ ధారపోసిపోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని వమ్ము జేసిన కాంగ్రెస్ (Congress) అసమర్ధతకు ఇది నిదర్శనమన్నారు. అంగట్లో కొలువులు అమ్ముకొని నిరుద్యోగుల గొంతుకోసిందని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
…………………………………………..