* ఆలయంలోకి దూసుకెళ్లిన ట్యాంకర్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్లోని ఎన్జీఆర్ఐ రెండో ఎంట్రన్స్ గేట్ సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలోకి ట్యాంకర్ దూసుకు వెళ్లింది. బస్ ను ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి ట్యాంకర్ రోడ్డు పక్కన ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలోకి దూసుకెళ్లింది. ట్యాంకర్ ఢీ కొనడంతో ఆలయం ప్రహరీ కూలిపోయింది. మంగళవారం కావడంతో ఆంజనేయస్వామీ దర్శనానికి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. కానీ ఈ ఘటనలో భక్తులెవరికీ ఏమీ కాలేదు.డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ట్యాంకర్ ను తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేశారు.
……………………………………….
