* సంగీత పరికరాలను బహుకరించిన సీఎం
ఆకేరు న్యూస్, హెదరాబాద్ : సంగీతంలో శిక్షణ పొందిన అంధ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి సంగీతానికి సంబందించిన వాయిద్య పరికరాలను బహుమతిగా ఇచ్చారు. కరీంనగర్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఈ నేపధ్యంలో విద్యార్థులు మంగళశారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలుసుకున్నారు. సీఎం రేవంత్ ఎదుట పాటలు పాడారు. అంధు విద్యార్థుల ప్రతిభకు ముగ్ధుడైన సీఎం వారికి కావాల్సిన సంగీత పరికరాలను బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత వారు పాడిన పాటల సీడీని ఆవిష్కరించిన సీఎంతో పాటు మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
