
* మహేష్ బాబుకు నచ్చిన సినిమా
ఆకేరు న్యూస్ డెస్క్ ః బాలీవుడ్ లో అమీర్ ఖాన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. తారలు మెచ్చే తార అమీర్ ఖాన్ అని చెప్ప వచ్చు .ఆయన నటించిన సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆయన సినిమా విడుదల అయితే కంపల్సరీగా చూస్తారు.. ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాతో స్టార్ డం సాధించిన అమీర్ ఖాన్ తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు.అమీర్ నటించిన సినిమాల్లో రాజా హిందుస్తానీ,మేలా,లగాన్,గజినీ, త్రీ ఈడియట్స్, తారే జమీన్ పర్, సితారే జమీన్ పర్ లాంటి సినిమాలు సినీ మేధావులచే ప్రంశసించబడ్డాయి. ఇటీవలే ప్రేక్షకుల మందుకు వచ్చిన సితారే జమీన్ పర్ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఈ సినిమాను చేసి సచిన్ టెండూల్కర్ షారూఖ్ ఖాన్ లు ప్రశంసల జల్లు కురిపించారు.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను తెగ మెచ్చుకుంటున్నాడు.ఈ సినిమాను వీక్షించిన మహేశ్ (Mahesh Babu) ఆమిర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాస్కెట్ బాల్ కోచ్‌గా అమీర్ నటన అద్భుతం అంటూ ట్వీట్ చేశాడు. ‘సితారే జమీన్ పర్’ చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు’’ అంటూ చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచేశారు. ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమిది మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న వాళ్లకు ఓ కోచ్ బాస్కెట్ బాల్ క్రీడలో శిక్షణ ఇచ్చి, వాళ్లను మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దే ఇతివృత్తంగా రూపొందింది.
………………………………..