
ఆకేరున్యూస్, బెంగళూరు: అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి టాయిలెట్‌లోని కమోడ్‌లో పడేసి ఫ్లష్ చేశారు. నీరు బ్లాక్ కావడంతో క్లీనింగ్ సిబ్బంది పరిశీలించి పైపుల్లో అడ్డుపడిన శిశువు మృతదేహాన్ని గుర్తించి షాక్ అయ్యారు. కర్ణాటకలో ఈ సంఘటన జరగగా.. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పసిబిడ్డ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన వారు ఇది బయటపడకుండా ఉండేందుకు ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.
………………………………………….