Baby Born With Four Arms and Legs
* ఎయిర్ అంబులెన్స్‌లో జబల్పూర్ తరలింపు
ఆకేరు న్యూస్, డెస్క్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్పూర్ జిల్లా లవ్కుష్ నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక అరుదైన ఘటన వెలుగుచూసింది. హర్ద్వార్ గ్రామానికి చెందిన రీటా అహిర్వార్ అనే మహిళ 4 కాళ్లు, 4 చేతులు ఉన్న మగశిశువుకు జన్మనిచ్చింది.
బాబు ఛాతీ, పొట్ట భాగంలో అదనపు శరీర భాగాలు అతుక్కుని ఉన్నాయి. వైద్య పరిభాషలో దీనిని ‘హెటెరోపాగస్’ లేదా ‘పారసిటిక్ ట్విన్నింగ్’ (Parasitic Twinning) అని పిలుస్తారు. తల్లి గర్భంలో కవల పిల్లలు పెరుగుతున్న సమయంలో, ఒక పిండం పూర్తిగా వృద్ధి చెందకపోవడం వల్ల ఆ భాగాలు ఇలా మరో బాబు శరీరానికి అతుక్కుపోతాయని వైద్యులు వెల్లడించారు.
బాబు బరువు సుమారు 3 కిలోలు ఉన్పట్లు, తల్లి మరియు బిడ్డ ఇద్దరూ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అదనపు అవయవాలకు రక్తప్రసరణ, ఎముకల అనుసంధానం (Bones Linkage) ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
లవ్‌కుష్‌నగర్ నుంచి బాబును మొదట ఛతర్పూర్ జిల్లా ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స మరియు శస్త్రచికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్స్‌లో జబల్పూర్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యులు బాబుకు శస్త్రచికిత్స చేసి అదనపు అవయవాలను తొలగించడంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
