Warangal Hunter Road Accident
అకేరు న్యూస్ వరంగల్ :వరంగల్ హంటర్ రోడ్డులో ఆదివారం రాత్రి మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ఫాలుడా జ్యూస్ బండి వద్ద ఆగి ఉన్న వాహనదారులను కారు ఢీకొట్టడంతో నలుగురు గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో వరంగల్ కమిషనరేట్ నిఘా విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ రాజును మట్టెవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో వాహనం నడిపినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
