*చంపాపేటలోజరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు..
ఆకేరు న్యూస్, సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డి జిల్లా (Sangareddy district) లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జిల్లాలోని కంది మండలం (Kandi Mandal), తనికిళ్ల (Tanikilla) వద్ద నాందేడ్- అకోలా జాతీయ రహదారి (Nanded-Akola National Highway) పై లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు పుల్కల్ మండలం (Pulkal Mandal), ఇసాజిపేట (Isajpet), గంగోజి పేట (Gangoji Peta) కు చెందిన వాళ్లుగా గుర్తించారు. హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాల సేకరణలో పోలీసులు ఉన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో..
హైదరాబాద్ (Hyderabad) లోని చంపాపేట ప్రధాన రహదారి (Champapet main road) పై మరో ప్రమాదం జరిగింది. ఇన్నోవా వాహనం అతివేగంతో దూసుకెళ్తూ రోడ్డు పక్క ఉన్న విద్యుత్ స్థంబానికి ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సరూర్ నగర్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. మృతులను సూఫీయాన్. మహమూద్ అద్నాన్ గా గుర్తించారు. గాయపడ్డ మరో ముగ్గురు యాసిన్, మహావేర్, మవ్యలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారంతా చాంద్రాయణగుట్ట రాజ్ నగర్ కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.
————————–