![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/images-18.jpg)
* ముగ్గురు యువకులు దుర్మరణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలంలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ముగ్గురు యువకులు మృతి చెందారు. బహదూర్‌పురా(Bahadurpura) నుంచి అరాంఘర్ వెళ్తుండగా శివరాంపల్లి వద్ద కొత్త పై వంతెనపై డివైడర్‌ను ఢీ కొనడంతో ఇద్దరు మైనర్ యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ యువకులు ముగ్గురూ బహదూర్‌పురాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
……………………………..