PM attends the annual NCC PM Rally, in Delhi on January 27, 2025.
* యువత భాగస్వామ్యం లేకుండా అభివృద్ధిని ఊహించలేం
* ఎన్సిసి ర్యాలీలో ప్రధాని మోడీ ఉద్ఘాటన
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ప్రపంచాభివృద్ధిలో భారతదేశ యువత కీలక భూమిక వహిస్తోందని, యువత భాగస్వామ్యం లేకుండా ప్రపంచాభివృద్ధిని ఊహించలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దశాబ్దాలుగా దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఢల్లీిలోని కరియప్ప గ్రౌండ్స్‌లో సోమవారంజరిగిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. ఎన్సీసీ డవలప్‌మెంట్‌కు గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పనితీరు తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని మోదీ అన్నారు. 170 సరిహద్దు ప్రాంతాలు, సుమారు 100 తీరప్రాంత సరిహద్దులకు ఎన్సీసీసీ క్యాడెట్లు విస్తరించారని, తద్వారా ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలపై డిబేట్‌ను ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు కొనసాగించాలని, దేశ యువత భవిష్యత్తుకు ఏకకాలంలో ఎన్నికలు కీలకమన్నారు. ప్రతి నెలలోనూ ఎన్నికలు జరుగుతూపోతుంటే కాలేజీలు, విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు సమయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. వికసిత్ భారత్ ఉద్దేశాలపై ఎన్సీసీ క్యాడెట్లతో సహా దేశ యవత దృష్టి సారించాలని మోదీ కోరారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
