
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)విదేశీ పర్యటన నేపథ్యంలో ఆయన ఎక్కిన విమానానికి ఫిబ్రవరి 11వ తేదీన ఓ బెదిరింపు కాల్ వచ్చింది. ఆ విమానాన్ని ఉగ్రవాదులు అటాక్ చేసే ఛాన్స్ ఉందని ఓ వ్యక్తి బెదిరించాడు. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ కాల్ పై క్షుణ్నంగా కేసు దర్యాప్తు చేపట్టారు. సమాచారం చాలా సీరియస్గా ఉన్నట్లు గ్రహించిన పోలీసుల.. కేసును తీవ్రంగా దర్యాప్తు చేపట్టారు. ఇతర దర్యాప్తు ఏజెన్సీలకు కూడా పోలీసులు ఈ సమాచారాన్ని చేరవేశారు. చాలా లోతుగా దర్యాప్తు చేపట్టారు. ముంబై పోలీసు కంట్రల్ రూమ్(Mumbai Police Control Room)కు ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చెంబూరు ప్రాంతం నుంచి అతన్ని అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తి మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు గుర్తించామని ముంబై పోలీసులు చెప్పారు
……………………………………