
* అటవీ ప్రాంత్రాన్ని జల్లడపడుతున్న ఫారెస్ట్ సిబ్బంది
ఆకేరున్యూస్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. రెండు రోజుల క్రితం మండలంలోని చింతలబోరి గ్రామశివారులో అటవీ సిబ్బందికి కనిపించిన పులి.. మళ్లీ బుధవారం ఉదయం 6 గంటలకు చింతలగూడ పరిసరాల్లో ఓ మహిళ కంటపడిరది. దీంతో భయాందోళనలకు గురైన మహిళ స్థానికులకు సమాచారమిచ్చింది. గ్రామస్థులు వెళ్లి చూడగా అది అప్పటికే పత్తి చేనులో నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు గ్రామస్తులు గుర్తించారు. విషయం తెలుసుకున్న సుమారు 20 మంది బేస్‌క్యాంపు సిబ్బంది పులిని పట్టుకునేందుకు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతుండగా.. బాబెరతండాలోని జాదవ్ దిలీప్‌నకు చెందిన ఎద్దుపై చింతగూడ అటవీ ప్రాంతంలో పెద్దపులి దాడి చేసి చంపినట్లు అటవీ సిబ్బంది గుర్తించారు. దీంతో పెద్దపులి కదలికలను గుర్తించేందుకు ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ విషయమై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
……………………………………………