![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/download-48.jpg)
* సీల్దా కోర్టు తీర్పుపై హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం
* దోషికి ఉరి శిక్ష వేయాలని పిటిషన్
ఆకేరు న్యూస్, డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యారాలిపై హత్యాచార కేసులో దోషికి సీల్దా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. కేసులో దోషిగా నిర్ధారించబడ్డ సంజయ్ రాయ్‌ను మరణించే వరకూ జైలులోనే ఉంచాలని ఆదేశించింది. ఆర్జీకార్ వైద్య కళాశాల (RG Kar Hospital) ట్రెయినీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్ (Sanjay Roy)కు జీవితఖైదు (life term)తో పాటు రూ.50 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులతో పాటు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Benargi) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసును కావాలనే తమ దగ్గర నుంచి లాక్కున్నారని, తమ పరిధిలో ఉంటే దోషికి ఉరిశిక్ష పడేలా చేసేవారమని పేర్కొన్నారు. ఈక్రమంలో తాజాగా కోల్‌కతా హత్యాచార కేసులో ఈరోజు హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం వెళ్లింది. సీల్దా కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేయనుంది. కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఏజీ ఆశ్రయించనున్నారు. దోషికి మరణశిక్ష విధించాలని వాదించనున్నారు.
……………………………………….