
* త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
ఆకేరు న్యూస్, వనపర్తి : ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు(Volvo Bus) అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. కరీంనగర్(Karimnagar) నుంచి అలంపూర్(Alampur)లోని ఆలయానికి వెళ్తుండగా పెబ్బేరు(Pebberu)లో ఈ ప్రమాదం జరిగింది. వేగానికి మూలమలుపులో బస్సును డ్రైవర్ అదుపు చేయలేకపోయినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………….