- పాముతో చెలగాటం.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు
ఆకేరున్యూస్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన మోచి శివరాజులు, తండ్రి గంగారాం పాములను పడుతూ జీవనం సాగిస్తుండేవాడు. శనివారం గంగారాం ఓ పామును పట్టి కుమారుడికి ఇచ్చాడు. నోట్లో పెట్టుకుని వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయమని చెప్పాడు. తండ్రి మాటతో శివరాజులు పామును నోట్లో పెట్టుకోగా ఆ పాము వెంటనే కాటేసింది. దీంతో పాముకాటు గురైన రాజు కొద్దిసేపటికే మృత్యువాత పడ్డాడు.