* స్పందించిన మునిసిపల్ కమిషనర్
* కేయూ మహిళా హాస్టల్లో కుక్కల పట్టివేత
* ఆకేరు న్యూస్‌కు ధన్య వాదాలు చెప్పిన విద్యార్థినులు
* విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం.
– ప్రొఫెసర్ గాదే సమ్మయ్య , డైరెక్టర్ , కేయూ హాస్టల్స్
ఆకేరు న్యూస్, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయంలో (Kakatiya University) మహిళా హాస్టల్ విద్యార్థుల సమస్యలపై అధికారులు దృష్టి సారించారు. అనేక అసౌకర్యాల నడుమ విద్యార్థులు కాలం వెళ్ళదీస్తున్నారు. చెత్తా చెదారంతో హాస్టల్ పరిసరాలు కంపు కొడుతున్నాయని చాలా కాలంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఫలితం కానరాలేదు. అన్నిటికి మించి పదుల సంఖ్యలో హాస్టల్ పరిసరాల్లో స్వైర విహారం చేస్తూ విద్యార్థులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏకంగా విద్యార్థుల బెడ్ల మీదకే వెళ్ళి హాయిగా సేద తీరుతున్నాయి. కుక్కల మద్య పోరు వాటి అరుపులతో తమ నిద్ర, చదువు తెల్లవారుతోందని ఇబ్బంది పడ్డారు.. పాములు సైతం బాత్ రూమ్‌ల్లోకి రావడంతో దినదిన గండంగా కాలం వెళ్ళదీశారు. ఇక ఎలుకలు సైతం నిద్ర పోతున్న విద్యార్థుల కాలి వేళ్ళను కొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. కేయూ హాస్టల్ విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న ఆకేరు న్యూస్ విద్యార్థినుల సమస్యలపై ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ సమస్యను హాస్టల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గాదే సమ్మయ్య కేయూ ఇంచార్జీ వీసీ వాకాటి కరుణ (Vakati Karuna) దృష్టికి హాస్టల్ డైరెక్టర్ తీసుకెళ్ళారు. ఆ మె వెంటనే గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే దృష్టికి తీసుకెళ్ళారు. కుక్కల సమస్య నుంచి హాస్టల్ విద్యార్థినులు విముక్తి అయ్యేటట్లు చూడాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన కమిషనర్ కేయూలో కుక్కలను పట్టేందుకు ప్రత్యేక టీంలను పంపించారు. గత రెండు రోజులుగా 30 కుక్కలను పట్టేశారు. విడతల వారిగా మిగతా వాటిని కూడా పట్టేస్తామని మునిసిపల్ అధికారులు అంటున్నారు.
* హాస్టల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టగానే సమస్యలు తెలుసుకున్నా
– ప్రొఫెసర్ గాదే సమ్మయ్య, కేయూ
నేను ఇటీవలనే బాధ్యతలు చేపట్టాను . హాస్టల్స్‌లో ఉన్న సమస్యలను గుర్తించాను. కేయూ హాస్టల్స్‌లో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళా విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నా. కుక్కల సమస్యతో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఇదే అంశంపై ఆకేరు న్యూస్ చానల్ స్టోరీ చేశారు. ఇంచార్జీ వీసీగా ఉన్న ఐఏయస్ అధికారి వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్ళాను. ఆమె వెంటనే మునిసిపల్ కమిషనర్ కు ఫోన్లో సమస్య వివరించి పరిష్కరించాలని ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్ కుక్కలను పట్టేందుకు ప్రత్యేక టీంలను పంపించింది. ఇప్పటి వరకు దాదాపు 30 కుక్కలను పట్టేశారు. ఇంకా మిగిలిన వాటిని కూడా త్వరలోనే పట్టకుంటామని మునిసిపల్ అధికారులు చెప్పారు. సమస్యను వెలుగులోకి తెచ్చిన ఆకేరు న్యూస్ చానల్‌కు , స్పందించిన ఇంచార్జీ వీసీ వాకాటి కరుణ, మునిసిపల్ కమిషనర్ అశ్వనీ తానాజీ వాఖడే లకు ప్రత్యేక కృతజ్ఞతలు .
* ఆకేరు న్యూస్‌కు కృతజ్క్షతలు
కుక్కలు సమస్య వల్ల చాలా ఇబ్బంది పడ్డాం . రాత్రయిందంటే చాలు బయటకు రావాలంటేనే భయంగా ఉండేది. రోగాల పాలయిన కుక్కల వల్ల మాకెలాంటి రోగాలు వస్తాయోనని భయపడే వాళ్లం..ఆకేరు న్యూస్ స్పందించి మా సమస్య అధికారులకు దృష్టికి వెళ్ళే విదంగా వార్తలను ప్రచురించింది. దీంతో ఇప్పటికే మునిసిపల్ సిబ్బంది వచ్చి కొన్ని కుక్కలను పట్టారు. ఇంకా కొన్ని ఇక్కడే తిరుగుతున్నాయి. వాటిని కూడా త్వరలోనే పట్టుకుపోతారని మేము ఆశిస్తున్నాం. చాలా కాలంగా మేము ఎదుర్కొంటున్న మా సమస్యకు పరిష్కారం చూపిన ఆకేరు న్యూస్ కు కృతజ్క్షతలు .
* ఆకేరు న్యూస్ కు ధన్యవాదాలు .
మేము ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో అతి ముఖ్యమైన కుక్కల సమస్య మాత్రం పరిష్కారం అయింది. పరిష్కారం కావడానికి దోహదం చేసిన ఆకేరు న్యూస్‌కు ధన్యవాదాలు. ఇదే విదంగా విశ్వవిద్యాలయంలోని ఇతర సమస్యలు కూడా ఆకేరు న్యూస్ దృష్టి పెట్టాలని కోరుతున్నాను.
* మా సమస్యను అర్థం చేసుకున్న ఆకేరు న్యూస్ ధన్యవాదాలు
ఆకేరు న్యూస్ ద్వారా బయటి ప్రపంచానికి మా సమస్య తెలిసింది. దీంతో వెంటనే మా సమస్యల పరిష్కారానికి అధికారులు ముందుకు వచ్చారు.ఇంత కాలం మేము అనుభవించిన బాధను అర్థం చేసుకున్న ఆకేరున్యూస్కు ధన్యవాదాలు.
* కుక్కల సమస్య పరిష్కారం అయింది.
– ప్రభాకర్, కేర్ టేకర్ కేయూ.
హాస్టల్ పరిసరాల్లో చాలా కుక్కలు ఉండేవి. వాటిని వెళ్ళగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాం. అయినప్పటికీ పలితం దక్కలేదు. ఆకేరు న్యూస్ ద్వారా సమస్య వెలుగులోకి రావడంతో మునిసిపల్ అధికారులు స్పందించారు. గత రెండు రోజులుగా దాదాపు 30 కుక్కలను పట్టుకు పోయారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. విద్యార్థుల సమస్య పరిష్కారానికి ఉపయోగపడిన ఆకేరు న్యూస్ కు కృతజ్ఞతలు.
———————————————————————————–