* ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం
ఆకేరు న్యూస్, విజయవాడ : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు తిరిగి పోస్టింగ్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను నియమించింది. ఐదేళ్ల క్రితం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే.. ఏబీ వెంకటేశ్వరరావును పలు ఆరోపణలతో సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. అప్పడు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తి వేయాలంటే ఏపీ ప్రభుత్వానికి క్యాట్ సూచించింది. దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలా ఐదేళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేసింది. ఉద్యోగ పదవీకాలం రీత్యా ఈరోజు సాయంత్రం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. అయితే నిన్న సచివాలయంలో వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్‌రెడ్డిని కలిశారు. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రతిని సీఎస్‌కు అందజేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్ ఇచ్చే అంశంపై త్వరితగతిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు ఉత్తర్వుల ప్రతిని సీఈవో కార్యాలయంలో కూడా ఏబీవీ అందజేశారు. కాగా, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఉదయం బాధ్యతల స్వీకరించిన ఏవీబీ.. పదవీ కాలం ముగియడంతో సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు.
—————————