* హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం
* కుమార్తె మృత దేహం లభ్యం
* ఆకేరు వాగులో విషాదం
ఆకేరు న్యూస్, వరంగల్ : వర్ష బీభత్సం ఎన్నో విషాదాలను మిగిల్చుతోంది. ఆకేరు వాగులో వరద ఉధృతి పెరగడంతో తండ్రి, కూతురు ప్రయాణిస్తున్న కారు గల్లంతయింది. ఖమ్మం జిల్లా గేట్ తండాకు చెందిన నూనావత్ మోతిలాల్ కూతురు అశ్విని తో కలిసి హైదరాబాద్‌కు బయలు దేరారు. ఆకేరు వాగు ఉధృతిలో కారు సహా తండ్రి , కూతురు కొట్టుకు పోయారు.
* సోదరుడి ఎంగేజ్ మెంట్‌కు హాజరై..
అప్పటి వరకు ఎంతో హాయిగా తండ్రి కూతురు హాయిగా మాట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు. కూతురు ఉన్నత విద్యావంతురాలు, బెంగళూరులో అగ్రికల్చర్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది. ఆదివారం ఉదయం విమానంలో బెంగళూరుకు ప్రయాణం చేయాల్సి ఉంది. శంషాబాద్ విమానాశ్రయం చేరుకోవడానికి బయలు దేరారు. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం పురుషోత్తమాయ గూడెం – తండ ధర్మారం మద్యలో ఉన్న బ్రిడ్జీ వద్ద వరద ఉధృతిని గమనించకుండా దూసుకుపోయారు. మద్యలో కి వెళ్ళగానే కారు ఆగిపోయింది. ఆ తండ్రీ కూతురుకు మృత్యువు ముంచుకొచ్చిందని అప్పడు అర్థమయింది. కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్లు చేశారు. నీళ్ళల్లో మునిగిపోతున్నామని రక్షించండని వేడుకున్నారు. రక్షణ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొద్ది సేపటికే వారి మొబైల్ ఫోన్లు స్విచాప్ అయినాయి. ఇద్దరి కోసం వెతకగా చాలా సేపటి వరకు ఆచూకి లభించలేదు. ఆకేరు వాగు కొంత దూరంలో పామాయిల్ తోటలో అశ్వని మృత దేహం లభించింది. మోతిలాల్ మృత దేహం మాత్రం లభించలేదు. . కాగా అశ్వని సోదరుడు ఖమ్మం జిల్లాలో పంచాయితీరాజ్ శాఖలో ఏఈ గా పనిచేస్తున్నాడు. సోదరుడి ఎంగేజ్ మెంట్‌కు హాజరయిన అశ్వని తిరిగి బెంగళూర్‌కు చేరుకునేందుకు విమానాశ్రయానికి తండ్రితో కలిసి వెళుతోంది. ఇంతలోనే వరద రూపంలో ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్నది. విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
———————————