* మారిన సిసోడియా స్థానం
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 11 మందితో తొలి జాబితాను రిలీజ్ చేయగా.. తాజాగా 20 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. ఇక ఈ లిస్ట్‌లో మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేరు ఉంది. ఆయన ఈసారి పట్పర్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా.. జంగ్‌పురా నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక ఇటీవలే ఆప్‌లో చేరిన ఉపాధ్యాయుడు అవధ్ ఓజాకు పట్పర్గంజ్ స్థానాన్ని కేటాయించారు.
………………………………….