
* అగ్రనేతలందరూ వెనుకంజలోనే..
* ఉత్కంఠగా ఎన్నికల ఫలితాలు
ఆకేరున్యూస్, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా జరుగుతోంది. చాలా ఏళ్ల తర్వాత బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. రౌండ్‌రౌండ్‌కు ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అదే సమయంలో ఆప్ అగ్రనేతలందరూ వెనుకంజలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిశీ, మనీశ్ సిసోడియాలపై ప్రత్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి ప్రవేశ్‌వర్మ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. కాగా తొలిరౌండ్లో 1500 ఓట్ల వెనుకంజలో ఉన్నారు కేజ్రీవాల్. ఓట్ల లెక్కింపు మొదలైన గంట తర్వాత కూడా ఆయన వెనుకంజలోనే ఉండడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ మూడోస్థానంలో కొనసాగుతున్నారు. కాగా.. కాల్కాజీ సెగ్మెంట్లో సీఎం ఆతిశి కన్నా రమేష్ బిధూరి 673 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా మూడోస్థానంలో ఉన్నారు. ఢిల్లీలో తెలుగువాళ్లున్న స్థానాల్లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. న్యూఢిల్లీ, కల్కాజీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. చంద్రబాబు ప్రచారం చేసిన షహదరాలోనూ బీజేపీ ఆధిక్యం కనిపిస్తోంది. సుమారు 26 ఏళ్ల తర్వాత కాషాయపార్టీ ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసింది. బాద్లీ, దేవ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ లీడిరగ్లో ఉండగా, ముస్లిం ప్రాబల్య సెగ్మెంట్ ఓక్లాలో ఆప్ బాగా వెనుకంజంలో ఉంది. ఓట్ షేరింగ్‌లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. బీజేపీకి సుమారు 52శాతం ఓట్లు పడగా, ఆమ్ఆద్మీకి 43శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ ఓటింగ్ శాతం 4శాతం కూడా దాటలేదు.
………………………………..