Abhijeet Dipe Detained Delhi
ఆకేరు న్యూస్, డెస్క్: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీపేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు స్ట్రీట్‌లోకి పెద్ద ఎత్తున చేరుకున్న సిజెపి కార్యకర్తలు వర్షంలోనూ నిరసన కొనసాగించారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆందోళనకారులు పోలీసులుపైకి వాటర్ బాటిళ్లు, చెప్పులు విసరడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘటనలో పోలీసులు, నిరసనకారులకు గాయాలయ్యాయి.
