* రూ.50 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ కిరణ్‌కుమార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేవాదాయ శాఖ అధికారి కిరణ్ కుమార్ ఏసీబీకి చిక్కారు. 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. హైదరాబాద్ బాగ్ అంబర్‌పేటలోని దేవాదాయ భూమి విషయంలో ఆయన లంచం డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ భూమి సర్వే రిపోర్టు ఇచ్చేందుకు ఆయన లంచం డిమాండ్ చేశారు. రూ.1.50 లక్షలు ఇవ్వాలని అన్నారు. అందుకు ఒప్పుకున్న బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ముందుగా రూ.50 వేలు ఇచ్చేందుకు కిరణ్ కుమార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈరోజు ఆయన లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.
……………………………………….
