ఆకేరు న్యూస్, కమలాపూర్ : గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ చాంపియన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎంకప్-2026 నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 9న మండలంలో రెండవ ఎడిషన్ సీ.ఎం. కప్ టార్చ్ లైట్ ర్యాలి నిర్వహించనున్నట్టు మండల ఎంపీడీవో గుండె బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న ఉదయం 9.30కి అంబాలలో శ్రీరాములపల్లి క్రాస్ వద్ద ర్యాలి ప్రారంభం అయ్యి గూడూర్, కమలాపూర్, లక్ష్మీపూర్, శనిగరం గ్రామాల ద్వారా ర్యాలీ నిర్వహించనున్నట్టు ఎంపీడీవో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, గ్రామ యువజన సంఘాల సభ్యులు, క్రీడా సంఘాల సభ్యులు, మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు, గ్రామంలోని యువత, విద్యార్థినీ, విద్యార్థులు, అధికారులు ఉద్యోగులు పాల్గొని కార్యక్రమము విజయవంతం చేయాలని ఎంపీడీవో కోరారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
