* రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజామున నుంచే తనిఖీలు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వ హాస్టళ్లలో పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న ఆహారం సహా సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించేందుకు ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు మొదలుపెట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ దాడులు (ACB Raids) కొనసాగుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) తో పాటు పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో(Government Hostels) మంగళవారం తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే, నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ ప్రయోజనాల తీరును పరిశీలిస్తున్నారు. కొంత కాలంగా ప్రభుత్వ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదుల మీరు దాడులు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా గతకొన్ని రోజులుగా వసతి గృహాల్లోని విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు (AcbOfficeres) ప్రభుత్వ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
—————————