ఆకేరున్యూస్, హన్మకొండ: హన్మకొండ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట్ రెడ్డి నివాసాల్లో బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒక ప్రైవేటు పాఠశాల గుర్తింపు పత్రాల పునరుద్ధరణకు రూ. 60,000 లంచం తీసుకుంటూ గత నెలలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో, అధికారులు తదుపరి చర్యల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, హన్మకొండలోని ఆయన ఇళ్లు, బంధువుల నివాసాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో డిప్యూటీ కలెక్టర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ కేసుకు సంబంధించి సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ డిఎస్పీ సాంబయ్య తెలిపారు.
……………………………….
