* కొబ్బరి బోండాల లారీ బోల్తా
* బోండాలను ఎత్తుకెళ్లిన స్థానికులు
ఆకేరు న్యూస్ సూర్యపేట్ : సూర్యపేట మండలం రామన్నగూడెం వద్ద సోమవారం తెల్లవారు జామున కొబ్బరి బోండాల లోడ్ తో వెళ్తోన్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. నెల్లూను నుంచి హైదరాబాద్ కు బొండాలను తీసుకెళ్తున్న లారి రామన్నగూడెం వద్దకు చేరుకోగానే అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న కొబ్బరి బోండాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.దీంతో స్థానికులు రోడ్డుపై పడ్డ కొబ్బరి బోండాలను అందినంతగా తీసుకెళ్లారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీని తీసి రోడ్డును క్లియర్ చేశారు. దాదాపు రెండు లక్షల విలువ చేసే కొబ్బరి బోండాలను ఎత్తుకెళ్లారని లారీ డ్రైవర్ వాపోయాడు.
…………………………………………
