* ఇద్దరు కానిస్టేబుళ్ల దుర్మరణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆ ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ కానిస్టేబుళ్లే. హైదరాబాద్ ఈసీఎల్‌లో జరుగుతున్న మారథాన్ రన్నింగ్ లో పాల్గొనేందుకు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి పోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. రాయపోల్ (RAYAPOL)పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పరందాములు , దౌల్తాబాద్(DOWLTHABAD) పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్.. ఈసీఎల్‌లో జరుగుతున్న మారథాన్ రన్నింగ్‌లో పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత జాలిగామ బైపాస్ వద్ద వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడం(ROAD ACCIDENT)తో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయా కుటుంబాల్లో తీరని విషాదంఒ నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులు పలువురు పోలీస్ సిబ్బంది కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాదానికి ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజీలను తనిఖీ చేస్తున్నారు. కానిస్టేబుళ్ల మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (HARISHRAO) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
…………………………..