“బ్యాగ్”మాన్ గా రేవంత్ రెడ్డి
* నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు రూటు..
* ఈడీ చార్జిషీట్లో సీఎం పేరు
* నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలి
* మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది
* ఎవరైనా మా అధ్యక్షుడికి లేఖలు రాయొచ్చు
* తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్.. దెయ్యం రేవంత్ రెడ్డి
* బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్.. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఆ దెయ్యాన్ని, శనిని తెలంగాణ నుంచి వదిలించడమే తమ పని అన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందని, ఎవరైనా సూచనలు, సలహాలు ఉంటే తమ నాయకుడికి ఉత్తరాలు రాయొచ్చని స్పందించారు. అంతర్గత విషయాలు బయటకు చెప్పకపోవడమే మంచిదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (REVANTHREDDY) యంగ్ ఇండియా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదని, మూటల ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఆరోజు మూటలు మోసే పీసీసీ పదవి తెచ్చుకున్నారని ఆ పార్టీ నేతలు చెప్పారని, ఇప్పుడు మూటలు మోసే తన పదవిని కాపాడుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ కు బ్యాగ్మాన్ అనే పేరు వచ్చిందన్నారు. రేవంత్ బుద్ది, వైఖరి మారలేదన్నారు.
తెలంగాణకు అవమానం
నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసు(NATIONAL HERALD MONEY LANDARING CASE)లో రేవంత్ పేరు ఉందని, ఇది తెలంగాణకు అవమానమని అన్నారు. సీఎం పేరు ఈడీ చార్జిషీట్లో వచ్చిందన్నారు. 16, 17 నెలల్లో 44వ సారి ఢిల్లీకి పోయిన ఒక అరుదైన రికార్డు రేవంత్ సృష్టించారన్నారు. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడడానికి, అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి.. తనను జైళ్లో వేయకుండా, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాళ్లతో ఒక మాట చెప్పండి.. చీకట్లో అమిత్ షాగారి కాళ్లు పట్టుకోవడం, బయటకు వచ్చి పెద్ద పెద్ద ఫోజులు కొట్టడం రేవంత్ చేస్తున్నారన్నారు. ఒక్క ఇటుక కట్టకుండా, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఇచ్చిన ఒక్క గ్యారెంటీ అమలు చేయకుండా, తెలంగాణలో 1,80,000 కోట్ల అప్పు చేశారని, ఆ డబ్బు ఎక్కడకు పోతుందని ప్రజలు అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ డబ్బును ఢిల్లీ బాసులకు దోచుపెట్టడానికే రేవంత్ కృషి చేస్తున్నారని,
రేవంత్ చేసేవి మూడే పనులు
రేవంత్ చేసినవి మూడే మూడు పనులు.. అవి బీఆర్ ఎస్ పైన నిందలు.. లీడర్లు, కాంట్రాక్టర్లతో దందాలు.. ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు.. అని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఒక ముఖ్యమంత్రి పేరును చార్జిషీట్ లో చేర్చితే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. యావత్ దేశం ముందు తెలంగాణ పరువు తీస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేసుల్లో కిరుక్కున్న చాలామంది గతంలో రాజీనామాలు చేశారని అన్నారు. రేవంత్ కు నిజాయితీ ఉంటు రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ డీఎన్ఏ లోనే కరప్షన్ ఉందన్నారు. పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు జరిగి ఏడాదైందని, ఆ వివరాలు ఇప్పటి వరకూ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోందని, త్రిబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందని స్వయానా ప్రధానమంత్రి (PRIME MINISTER) గతంలోనే ఆరోపణలు చేశారని, వార్షికోత్సవం అవుతున్నా వాటిపై దర్యాప్తు, చర్యలు లేవన్నారు. కాంగ్రెస్(CONGRESS), బీజేపీ(BJP)లు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నారు.
……………………………………………………….
