ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఈరోజు విడుదల చేసింది. తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 13న పాలిసెట్(TG Polycet) పరీక్షను నిర్వహించారు. మూల్యాంకనం అనంతరం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో సాంకేతిక విద్య కమిషనర్ దేవ సేన పాలీసెట్ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాల్లో నలుగురికి టాప్ -1 ర్యాంక్ వచ్చింది. మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 81.88% శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/#!/index ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
