* సీఐ గోపీ, ఎస్ ఐ విఠల్ సైతం
* తప్పుడు కేసులు నమోదు చేసినందుకే..
వరంగల్ , ఆకేరు న్యూస్ : వరంగల్ ఏసీపీగా పనిచేసి బదిలీ అయిన నందిరాం నాయక్‌ను డీజీపీ శివధర్ రెడ్డి సస్పెండ్ చేశారు. నందిరాం నాయక్‌తో పాటు సీఐ తుమ్మ గోపీ, ఎస్ ఐ విఠల్ పై కూడా సస్పెన్సన్ వేటు వేశారు. వరంగల్ ఏసీపీగా నందిరాం నాయక్, సీఐ గోపీ, ఎస్ ఐ విఠల్‌లు తమ పనిచేసిన కాలంలో అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు పలువురి పై కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే విదంగా దాదాపు 11 కేసుల్లో తప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున డబ్బులు వసూల్ చేశారన్న విమర్శలు ఉన్నాయన్న నివేదికల మేరకే డీజీపీ వీరిపై సస్పెన్సన్ వేటు వేసినట్లు సమాచారం. ఒకేసారి ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవడం వరంగల్ నగరంలో చర్చనీయాంశమవుతోంది.
* కొండా కు ఎదురు గాలి..
ఇటీవలి కాలంలో అధికారులు చేపడుతునన చర్యలు మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఇటీవలే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ ముఖ్య అనుచరుడు గోపాల నవీన్ రాజు మీద కేసు నమోదైంది. అదే విదంగా మరో ముఖ్య అనుచరుడు నల్గొండ రమేశ్ కొండా మురళీ వైరీ వర్గం అయిన మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య దరికి చేరుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం రౌడీ చేతుల్లోకి వెళ్ళిందని బహిరంగంగానే నల్గొండ రమేశ్ విమర్శించారు. మంత్రి కొండా సురేఖ పీఏ పై చర్యలు తీసుకునేందుకు మంత్రి నివాసానికి పోలీసులు వెళ్ళడం .. ఈ సందర్భంగా కొండా దంపతుల కూతురు డాక్టర్ సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనం అయింది.. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కొండా దంపతులు కలవడం.. తమ కూతురు వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ సారీ చెప్పడం లాంటి ఘటనలు జరిగిపోయాయి. సమస్య అంతా సద్దు మణిగిందనకున్నారు.. ఇందుకు భిన్నంగా ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కొండా దంపతులకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టే కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొండాకు ఎదురు గాలి వీస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.
——————————

