– ఉద్దేశ పూర్వకంగా కామెంట్స్ చేయలే
– నటుడు శివాజీ
ఆకేరు న్యూస్, కమలాపూర్ : టాలీవుడ్ లో హీరోయిన్ ల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల పై మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను అని శివాజీ సోషల్ మీడియా వేదికగా నిన్న సాయంత్రం వీడియోను పోస్ట్ చేశారు. తన వ్యాఖ్యలతో మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని సారీ చెప్పారు. దండోరా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కావాలని కామెంట్స్ చేయలేదని అన్నారు.
క్షమాపణ వీడియోలో..
దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ ల దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ తీవ్రంగా స్పందించడంతో శివాజీ తన తప్పుపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దండోరా సినిమా ఈవెంట్లో హీరోయిన్లు పడుతున్న ఇబ్బందుల గురించి చెబుతూ, ఆవేశంలో రెండు అన్‌పార్లమెంటరీ పదాలు వాడాను. అది నా తప్పే, ఆ మాటలు అనకుండా ఉండాల్సింది అని సారీ చెప్పారు.శివాజీ క్షమాపణలు చెప్పినప్పటికీ, శివాజీ వాడిన పదజాలంపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందిస్తూ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వారు ఎంతటి వారైనా సరే,కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
…………………………………………………………

