Aditi Rao Hydari on Ranbir Kapoor
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నటి అదితిరావు హైదరీ..సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబుకు జోడిగా సమ్మోహనంలో నటించారు. టాలీవుడ్ లో ఆమెకు ఇదే తొలి సినిమా. హిందీ, తెలుగు, మళయాళ్లలో సినిమాలు చే స్తున్నారు. బొమ్మరిల్లు, నవ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రాల్లో తన నటనతో మెప్పించిన సిద్ధార్థ ఆమె భర్త. అయితే రణబీర్ కపూర్ కేవలం ప్రేక్షకుల నుంచే కాకుండా తన తోటి నటీనటుల నుంచి కూడా ప్రశంసలు పొందుతారని మనకు తెలుసు. ఇప్పుడు ఈ జాబితాలో హైదరీ కూడా చేరారు.
* రాక్ స్టార్..
రాక్ స్టార్ చిత్రంలో రణబీర్ కపూర్ లీడ్ రోల్లో నటించారు. ఇందులో షీనా అనే పాత్రలో అదితిరావు హైదరీ యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో ఆమె ఒక జర్నలిస్ట్ .. రిపోర్టర్ పాత్రలో కనిపిస్తారు. కథానాయకుడు జనార్దన్ జాకర్ (రణబీర్ కపూర్) ‘జోర్డాన్’ అనే అంతర్జాతీయ రాక్ స్టార్‌గా ఎదిగే క్రమంలో అతని ప్రయాణాన్ని, వ్యక్తిత్వాన్ని కవర్ చేసే కీలకమైన సహాయక పాత్ర ఇది.
* ప్రేక్షకులు నమ్మేలా చేయగలరు..
తాజాగా ఆమె ఒక మ్యాగజైన్ తో చిట్ చాట్ చేశారు. రాక్ స్టార్ షూట్ సమయంలో రణబీర్ కపూర్ తో స్ర్కీన్ షేర్ చేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పరిశ్రమలోని అత్యుత్తమ నటులలో ఆయన ఒకరని పేర్కొన్నారు. “రణబీర్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవం. ఆయన నిజంగా అద్భుతమైన నటుడు. నాకు ఇష్టమైన నటులలో ఆయన ఒకరు, అంతేకాకుండా నటనలో ఆయన ఎంతో ఏకాగ్రతతో, పూర్తిగా లీనమై ఉంటారు. ఏదైనా విషయాన్ని ప్రేక్షకులు నమ్మేలా చేయగల సామర్థ్యం ఆయనకు ఉంది.” అని అన్నారు.
* రాముడిగా రణబీర్ సింగ్
రణబీర్.. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రం, భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న రామాయణలో శ్రీరాముడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
