Adapa Mahesh Funeral Tribute
* అడప మహేష్‌కి కాంగ్రెస్ నేతల నివాళి
* నివాళులర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే, MLC సారయ్య
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అడప మహేష్ అకాల మరణం కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.
ఈ రోజు నిర్వహించిన అడప మహేష్ అంతిమయాత్రలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొని ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి అశ్రునయానాల నడుమ ఘనంగా నివాళులర్పించారు.
* పాల్గొన్న ముఖ్య నేతలు..
మహేష్ అంతిమయాత్రలో వర్ధన్నపేట శాసనసభ్యులు (ఎమ్మెల్యే) కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కుడా (KUDA) చైర్మన్ ఇనోగాల వెంకటరామిరెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ ఆయూబ్ లతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీకి అడప మహేష్ అందించిన సేవలు మరచిపోలేనివని, సోషల్ మీడియా వేదికగా పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మహేష్ అంతిమయాత్ర సాఫీగా సాగేలా చూస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ తీవ్ర సానుభూతిని తెలియజేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
