JP Nadda CJP Meeting
ఆకేరు న్యూస్, డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో సీజేపీ (CJP) చేపట్టిన ‘చలో పార్లమెంట్’ నిరసనల మధ్య ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.
* సీజేపీ ముందుంచిన 3 ప్రధాన డిమాండ్లు..
సోనమ్ వాంగ్చుక్ తక్షణ విడుదల: నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న సామాజిక, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలి.
కేంద్ర విద్యార్ధుల వ్యవహారాల మంత్రి రాజీనామా: నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత తక్షణమే రాజీనామా చేయించాలి.
బాధిత కుటుంబాలకు పరిహారం: నీట్ పేపర్ లీక్ వివాదం, మానసిక ఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలి.
తనను కలిసిన సీజేపీ ప్రతినిధుల వద్ద ఉన్న డిమాండ్లను పరిశీలించినట్లు కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్ట్యా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని, కావున నిరసనకారులు తమ ఆందోళనను విరమించి శాంతియుత వాతావరణానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అయితే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని, నిరసనలు కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
