
* ఇంకెంత సమయం కావాలన్న సుప్రీం
* కొంచెం గడువు ఇవ్వాలని కోరిన న్యాయవాది
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ (Brs) ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను సుప్రీంకోర్టు(Suprim Court) ఈనెల 18కు వాయిదా వేసింది. స్పీకర్ నుంచి సమాచారం కోసం అసెంబ్లీ కార్యదర్శి లాయర్ సుప్రీంను సమయం కోరారు. అసెంబ్లీ కార్యదర్శి తరఫున ముకుల్ రోహీత్గీ వాదనలు వినిపించారు. ముకుల్ రోహీత్గీ విజ్ఞప్తి మేరకు జస్టిస్ గవాయ్ (Justice Gavai)ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఇప్పటికే 10 నెలలు పూర్తయింది.. విచారణకు ఇంకెంత సమయం కావాలని ధర్మాసనం ప్రశ్నించివంది. స్పీకర్ తో చర్చించి వివరాలు అందిస్తామని ముకుల్ విజ్ఞప్తి చేయడంతో సుప్రీం ధర్మాసనం విచారణను వాయిదా వేఇసంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Pocharam Srinivasreddy), ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ(Arekapudi Gandhi)పై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ వేశారు.
…………………………………………………