
పిల్లి కార్తిక్
ఆకేరు న్యూస్, హనుమకొండ : యువ న్యాయవాది పిల్లి కార్తిక్ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేస్తూ మే 29వ తేదీన TPCC లీగల్ సెల్ ఛైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నియామక పత్రాన్ని అందించారు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు కార్తిక్. ఈ సందర్బంగా కార్తిక్ మాట్లాడుతూ తనను నియమించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం అశోక్ గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలకు, సహకరించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
——