
* సీఎం, సినీ పెద్దలు ఏమన్నారంటే..?
హైదరాబాద్, ఆకేరు న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సుమారు రెండు గంటల పాటు జరిగింది. సినీ ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి స్పష్టంగా చెప్పారు. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే సీఎంతో భేటీ అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. అవి వారి మాటల్లోనే.
సీఎం రేవంత్ రెడ్డి
బెన్ఫిట్ షోలు, స్పెషల్‌గా టికెట్ రేట్ల పెంపు ఉండదు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను సినీ పరిశ్రమ ప్రమోట్ చేయాలి. పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలి.
– నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు –
తెలంగాణ ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వాల చొరవతోనే ఆనాడు ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలి.
– హీరో నాగార్జున –
యూనివర్సల్ లెవల్లో స్టూడియో సెటప్ ఉండాలి.. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే పరిశ్రమ ఎదుగుతుంది.. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావలన్నది మా కోరిక.
– తెలంగాణ డీజీపీ సూచనలు –
సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే, దానిని పాటించాలి.. పోలీసులు అన్ని రకాలుగా ఆలోచించే అనుమతి ఇవ్వలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటారు.. పోలీసుల నిర్ణయాన్ని టాలీవుడ్ పెద్దలు గౌరవించాలి.. బౌన్సర్లు నియమించుకున్నప్పుడు న్యాయ సమ్మతం ఉండాలి.. ఇటీవల బౌన్సర్లు తీరు, ప్రవర్తన బాగలేదు. ఏ ఈవెంట్ అయినా ముందోస్తు అనుమతులు తీసుకోవాలి.
– టాలీవుడ్ పెద్దలు –
సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది.. తెలంగాణ ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది
………………………………………