– ప్రతిమ సంచార ఆరోగ్య రథంలో ఉచిత అత్యాధునిక డయాగ్నోస్టిక్ టెస్ట్లు
ఆకేరు న్యూస్ , కమాలాపూర్ : కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో గురువారం ప్రతిమ హాస్పిటల్స్ ఫౌండేషన్ వారి సహకారంతో ఆర్యవైశ్య మహాసభ హనుమకొండ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్, ఆర్థోపెడిక్, పల్మానాలజీ,వివిధ ఆరోగ్య విభాగాలలోని స్పెషలిస్ట్ డాక్టర్లు ఓ.పీ. ద్వారా వచ్చిన పేషంట్ లకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు.
అవసరమైన వారికి ఉచితంగా ప్రతిమ సంచార ఆరోగ్య రథంలో అత్యాధునిక డయాగ్నోస్టిక్ అయిన 2D- ఎకో, కార్దియాక్ పరీక్షలు, మమ్మోగ్రఫీ,ఎక్స్ – రే, మినీ లాబొరేటరీలో వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు కూడా పంపిణీ చేశారు. అవసరమైన వారికి కరీంనగర్ లోని ప్రతిమ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. వైద్య శిబిరం ఏర్పాటుపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డాక్టర్లు,ఆర్యవైశ్య మహాసభ హనుమకొండ జిల్లా అధ్యక్షులు తోట సురేష్, గ్రామ పెద్దలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
