* మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ
ఆకేరు న్యూస్, వరంగల్ : వ్యవసాయాన్ని ప్రోత్సహించి.. రైతుల సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖలో పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర స్థాయి సంస్థ.. ఉధ్యానవన పంటలు పండిరచే రైతులకోసం పరిశోదనా కేంద్రం ఉండాలనే సంకల్పంతో.. మిర్చి ఎక్కువగా పండే వరంగల్ జిల్లాలో దాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారికి విన్నవించి ప్రత్యేకంగా హర్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్‌ను వరంగల్ జిల్లా కన్నారావుపేటలో ఏర్పాటుకు జీఓ – 31 ద్వారా మంజూరయింది. ఇందుకు సర్వే నంబర్ 58లోని 54ఎకరాల భూమిని కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ హర్టికల్చర్ యూనివర్సిటీకి అందజేశామని తెలిపారు. నూతన ప్రభుత్వం కొలువుదీరి 10 నెలలు గడుస్తున్నా సదరు రిసెర్చ్ స్టేషన్‌కు సంబందించిన విషయంలో ఎలాంటి పురోగతి లేదన్నారు.
రైతులకు, వ్యవసాయానికి ఉపయోగపడే హర్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ సంబందించి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే 80 కోట్ల రూపాయలతో మార్కెటింగ్ అండ్ వేర్ హౌజింగ్ కార్పోరేషన్ ద్వారా లక్ష టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములు అందుబాటులోకి తెచ్చాం. వాటిని కూడా వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. అలాగే నర్సంపేట నియోజకవర్గానికి మల్టిపుల్ ఫామ్ మెకనైజేషన్ స్కీమ్ ప్రత్యేకంగా పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణలోనే తొలిసారి తీసుకువచ్చామని..ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. నర్సంపేట నియోజకవర్గంలో ప్రత్యేకంగా FPO (Farmer Producing Organaisation ) అందుబాటులోకి తీసుకొచ్చామని.. కాంగ్రేస్ ప్రభుత్వం ఎలాంటి కొనుగోలు కేంద్రాలు FPOలకు ఇవ్వటం లేదని.. FPOలకు కొనుగోలు కేంద్రాలు ఇవ్వాలని కోరారు. అలాగే పూర్వపు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిదిలో ఎక్కువగా సాగుచేసే వరంగల్ చపాట మిర్చీకి బౌగోళిక గుర్తింపు జియాలాజికల్ ఇండికేషన్ రావాలని 2022 లోనే దరఖాస్తు చేసామని.. ఆ దరఖాస్తు పెండిరగ్లో ఉందని… దాన్ని త్వరితగతిన చర్యలు చేపట్టి వరంగల్ చపాట మిర్చికి గుర్తింపు వచ్చే విదంగా కృషి చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో రుణమాఫీ సైతం 40% మంది రైతులకు మాత్రమే పూర్తి అయిందని.. మిగిలిన రుణమాఫీని పూర్తి చేసి రైతులను ఆదుకుని.. వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు.
…………………….