* ఇప్పటికే చెన్నై అతలాకుతలం
* ఏపీ, తెలంగాణలోనూ భారీ వర్షాలు
* హైదరాబాద్‌లో ప్రారంభమైన వానలు
ఆకేరు న్యూస్, డెస్క్ : తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చెన్నయ్ అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెన్నయ్ సహా పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఉద్యోగులకు మూడు రోజలుపాటు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించారు. పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
తెలంగాణలో..
తెలంగాణకు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబాబాద్, హైదరాబాద్ తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో వర్షం కురుస్తోంది. ఉప్పల్ , రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, తార్నాక, సికింద్రాబాద్, అబిడ్స్, చార్మినార్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ ఎంసీ అప్రమత్తమైంది.
ఏపీలో..
ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి తుర్పుగోదావరి, ప్రకాశం , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావంతో మూరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. చిత్తూరు కడప, అన్నమయ్య జిల్లాలపై కూడా తుఫాను ప్రభావం ఉంచనుంది. తుఫాను నేపథ్యంలో హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు చాటింపు వేశారు. నెల్లూరు, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి, జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి.
……………………………………..